నీ సేవలోనే నా తుది శ్వాసను song lyrics | Nee Sevalone Naa Thudi Swasanu Song Lyrics - Telugu Latest Christian Song Lyrics
Singer | Raju |
నీ సేవలోనే నా తుది శ్వాసను -
విడువాలని యేసయ్య -
నీకై బ్రతకాలని ఆశయ్య (2)
నీవే నా ఆశయ్య .... నివే శ్వాసయ్యా .....
నీవే నా సర్వము యేసయ్య - నీవే నా ప్రాణము యేసయ్య
1.అగ్ని గుండమే ఏదురైనా -
సింహల బోనులు నన్ను అడ్డగించిన (2)
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే -
చావైతే అది నాకెంతో మేలు (2)
షడ్రక్ మెషక్ వలే - అబెద్నగో వలె -
దానియేలు వలే యేసయ్య -
నీకై బ్రతకలాని ఆశయ్య (2) ||నీ సేవలోనే||
2.ఎండమావులే ఎదురైనా -
ఆశ నిరాశలు ఎన్నో కలిగిన (2)
ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు -
వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు (2)
మగ్దలేనె వలే - సమరయ స్త్రీవలే -
సారే పతు స్త్రీవలే యేసయ్య -
నీకై బ్రతుకలాని యేసయ్యా ఆశయ్యా (2) ||నీ సేవలోనే||