నీ మందిరమై నేనుండగా Song Lyrics | Nee mandiramai nenundaga Song Lyrics - Sis. Joy Cherian Songs Lyrics
Singer | Sis. Joy Cherian |
పల్లవి:
నీ మందిరమై నేనుండగా
నా యందుండి నడిపించవా"2"
నీవు తోడుండగా నాకు దిగులుండునా"2"
వెంబడిస్తాను నిను యేసువా"2"
చరణం1:
నీవు కోరేటి దేవాలయం
నాదు దేహంబెగా నిశ్చయం"2"
నీదు ప్రత్యక్షత నాకు కలిగించవా"2"
నిత్యము నిన్ను స్తుతింతును"2"నీ మంధిరమై"
చరణం2:
నాడు నిర్మించే దేవాలయం
రాజు సొలొమోను బహుసుందరం"2"
అట్టి దేవాలయం నేను నిర్మించగా"2"
నీ కట్టడలో నను నిల్పుమా"2"నీ మందిరమై"
చరణం3:
హన్న ప్రార్ధనను విన్నావుగా
నేనున్నానని అన్నావుగా "2"
నేడు సమూయెలుతో బహుగా
మాట్లాడినా"2"
దేవా నాతోటి మాట్లాడవా"2"నీ మందిరమై"
చరణం4:
ఆత్మసత్యముతో ఆరాధింప
ఆత్మదేవుండు నేర్పించుమా"2"
మహిమ రూపంబును నేను దర్సింపను"2"
నా నేత్రంబు వెలిగించుమా"2"నీ మందిరంమై"
చరణం5:
ఆ పరలోక ప్రతిబింబమై
ఈ ధరలోన దీపంబునై"2"
ధరణి వెలిగించను కరుణ ప్రసరింపను"2"
కరము తోడుంచి నడిపించుము"2"నీ మందిరమై"