ధూళినయ్యా నే ధూళినయ్యా Song Lyrics | Dhulinaya ne Dhulinaya Song Lyrics - Sirivella Hanok Songs Lyrics
 
	
	| Singer | Sirivella Hanok | 
ప॥  ధూళినయ్యా నే ధూళినయ్యా
       ధూళిని నీ నీటితో తడిపి మలచిన బొమ్మనయా
       మట్టిపాత్రనయా
1.   గాలెటు వీచునో వీచినవైపుకే మరలిపోయే బ్రతుకు నాది 
      గగనము నుండి కురిసిన కృపావర్షం (2)
      గుణమును మార్చెను - స్థిర జీవమునిచ్చెను
2.  సుడిగాలి వలెనె గిరగిర తిరిగే గమ్యములేని బ్రతుకు నాది
     పరము నుండి రాలిన ప్రేమ వర్షం (2)
     రూపము మార్చెను - స్థిర మార్గము చూపెను

