Type Here to Get Search Results !

ఎవ్వరిని అడగాలి Song Lyrics | Evarini Adagali Song Lyrics - Good Friday Song Lyrics - Gospel Songs Lyrics

ఎవ్వరిని అడగాలి Song Lyrics | Evarini Adagali Song Lyrics - Good Friday Song Lyrics

Singer Shailaja

పల్లవి:
ఎవ్వరిని అడగాలి - మా పాపములు కడగమని
ఎవ్వరిని కోరాలి - మా దోషములు తీయమని ''2''

పాపులలో చేరని వారు ఎవరూ ప్రభు...
పరిశుద్ధులుగా మలిచే పవిత్రులు ఎవరు

నీవే... నీవే... నీవే ప్రభు మాకు రక్షణ
నీవే యేసు రక్త ప్రోక్షణ

నీవే ప్రభు మాకు రక్షణ
నీవే యేసు పాప విమోచన ''ఎవరిని అడగాలి...''

చరణం 1:
నీ సిలువ మరణం - అది మాకు జీవం
తల ముళ్ళ కిరీటం - మాకు జీవ కిరీటం
నీకు అవమానం - మా జన్మ ధన్యం
నీ రక్త ధారం - పరమునకు మార్గం
నిందలు, అవమానములు నీకు
మేలులు, ఈవులు మాకు
పరమును వీడిచావు నీవు
పాపులను ప్రేమించినావు ''నీవే..నీవే...''

చరణం 2:
కానరాని ఘోరం - అది ఎంతో భారం
వినలేని మౌనం - కడదాక రుధిరం
ఇది ఎంతో సహనం - నీకే అది సొంతం
ఎవరూ చేయని ధైర్యం - మాపై చూపిన త్యాగం
మేకులు, ఉమ్ములు నీకు
పరమనే దీవెనలు మాకు
శ్రమలు, కన్నీళ్ళు నీకు
వాక్యమనే ఆశీర్వాదం మాకు ''నీవే..నీవే...''



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area