Type Here to Get Search Results !

పరలోకము నా దేశము Song Lyrics | Paralokamu naa desamu Song Lyrics - Zion Songs Lyrics

పరలోకము నా దేశము Song Lyrics | Paralokamu naa desamu Song Lyrics - Zion Songs Lyrics

Singer Bro. Nehamiah

పరలోకము నా దేశము
పరదేశి నేనిల మాయలోకమేగ
నేను యాత్రికుడను (2)

ఎంతో అందమైనది పరలోకము
అసమానమైనది నా దేశము (2)
ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2) ||పరలోకము||

దూతలు పాడుచుందురు పరమందున
దీవా రాత్రమునందు పాడుచుందురు (2)
పావనుని చూచి నేను హర్షింతును నిత్యము (2) ||పరలోకము||

రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్
వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని (2)
కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ (2) ||పరలోకము||

అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్
అగుపడుచున్నది గమ్యస్థానము (2)
అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్ (2) ||పరలోకము||

నిత్యానందముండును పరమందున
నీతి సమాధానము ఉండునచ్చట (2)
పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి (2) ||పరలోకము||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area