చూచితి నీ మోముపై Song Lyrics | Chuchithi Nee Momupai Song Lyrics - Good Friday Songs Lyrics
	
	| Singer | Ps. Jyothi Raju | 
చూచితి నీ మోముపై - చిందిన రక్తము 
తలచితి నీ ప్రేమను - మదికి అందనిదాయె 
రాజ మఖుఠము  మారిపోయే - ముళ్ల ముఖుఠముగా 
సింహాసనమే శిలువగ మారే - శిక్షకు గురియాయేగా 
" పరిమితి లేని కలువరి ప్రేమను - పరిహాసము చేసిరే 
ఆ ప్రేమనెరిగి  నీ పాద సేవయే చాలని - నీ చెంత చేరితిని"        యేసు....."చూచితి"
1. నేలపై ఒలికిన నీ రక్త ధారలే - ప్రతి పాపిని కడిగెను 
ఆ రక్త ధారలే పాపికి మార్గమై - పరముకు ప్రవహించెను "2"
మట్టి దేహమును - మహిమగ మార్చుటకు "2"
మాపై నీకున్న సంకల్ప ప్రేమను - పరిహాసము చేసిరే "2"    యేసు....."చూచితి"
2. సిలువలో చిందిన రక్తపు జల్లులు - ప్రతి రోగిని కడిగెను 
చితికిన దేహమున ఒలికిన రుధిరము - పరమౌషధమాయెను "2"
మా రోగములను - భరియించుటకు "2"
మాపై  నీకున్న ఎనలేని ప్రేమను 
అవహేళన చేసిరే "2" యేసు....."చూచితి"
