Type Here to Get Search Results !

Pakshi Rajuvale Song Lyrics | పక్షిరాజు వలె Song Lyrics - Calvary Ministries Songs Lyrics

Pakshi Rajuvale Song Lyrics | పక్షిరాజు వలె Song Lyrics - Calvary Ministries Songs Lyrics

Pakshi Rajuvale Song Lyrics

పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా!
అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! - 2

ఆ… శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు - 2

పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా!
అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! - 2

యీ లోక స్నేహితులు యీ లోక బంధువులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు - 2
ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమ లన్ని కోల్పోయిన - 2
క్రీస్తు యేసు ప్రేమలో సాగిపోదామా! - 2

యీ లోక పోరాటం సాతాను శోధనలు హృదయమును కృంగదీసినా - 2
అడుగడుగునా సంకెళ్లతో అడుగు వేయలేకున్నా - 2
క్రీస్తు యేసు ప్రేమలో ఎగిరిపోదామా! - 2

ఆ మహిమ రాజ్యములో ఆ నిత్య రాజ్యములో కన్నీరుండదు దిగులుండదు - 2
ఎల్లప్పుడూ సంతోషముతో ఎల్లప్పుడూ ఆనందముతో - 2
హల్లెలూయా గీతాలతో నిలిచిపోదామా! - 2

పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా!
అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! - 2

ఆ… శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు - 2

పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా!
అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! - 2



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area