Chinthinchaku Nesthama With Lyrics | చింతించకు నేస్తమా Song Lyrics - Jesus Songs Lyrics

Singer | Nycil |
చింతించకు నేస్తమా – దిగులు పడకు నేస్తమా
కన్నీరే కార్చిన - నీ బ్రతుకే ధన్యమే
బ్రతుకే భారమైన – నిందల పాలైన
నీ జీవితమంతా - ఎంతో ఫలించునులే ||2||
యేస్సయ్య నీ కృప - కావాలి మా బ్రతుకులలో ||2||
1. నీ బ్రతుకంత – కష్టమే మిగిలిన
నీ జీవితమంత – దుఃఖమే మిగిలిన ||2||
మాటిచ్చిన దేవుడు - నిన్నాధరించును
నీ కష్టకాలమును - ఆయనే కడతేర్చును ||2||
||యేస్సయ్య||
2. నీవు చేసే ప్రతిపని- ఆయన చూచును
నీకున్న ప్రతి భారం - ఆయన మోయును ||2||
దైర్యమును విడువక – భారముతో సాగిపో
విశ్వాసం విడువక –దేవునిలో నిలిచిపో ||2||