ఎట్టి వాడో యేసు Song Lyrics | ఎట్టి వాడో యేసు Song Lyrics - Sharon Sisters Old Christian Songs Lyrics
Singer | Sharon Sisters |
ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవి
వట్టి నరుడు కాడు – పట్టి చూడ ప్రభుని – (2) ||ఎట్టి||
గాలి సంద్రాలను – గద్ధింపగా యేసు (2)
హద్దు మీరక ఆగి – సద్దుమణిగిపోయే (2) ||ఎట్టి||
పక్షవాతపు రోగిని – తక్షణమే లెమ్మనగా (2)
పరుపెత్తుకొని లేచి – పరుగెత్తికొనిపోయె (2) ||ఎట్టి||
పట్టు యేసుని పాదం – తట్టు దేవుని ద్వారం (2)
కట్టు ఇక నీ పాపం – నెట్టు నిను పరలోకం (2) ||ఎట్టి||