Neekemi chellinthunayya song lyrics | నీకేమి చెల్లింతునయ్యా Song Lyrics - Latest Telugu Christian Songs Lyrics

Singer | Anesha |
నీకేమి చెల్లింతునయ్యా
సిలువలో నీవు చూపిన ప్రేమకై "2"
మాటలతో ప్రకటించినా
పాటలతో ఘనపరిచనా "2"
ఆత్మతో ఆరాదించనా నా యేసయ్య "4"
నరులను ప్రేమించి వారి పాపము క్షమియింప
పరమును విడిచి ఇల భువికేతెంచావు "2"
రిక్తుడిగా వచ్చి దాసుడవైన యేసయ్య "2"
దాసుడవైన యేసయ్య
ఆత్మతో ఆరాదించనా నా యేసయ్య "4" "నీకేమి "
సిలువను మోసి దాని విలువను మార్చావు
కలువరి గిరిని రక్షణ గిరిగా మార్చావు "2"
పాపినైన నన్ను మార్చి నా గతిని చూపిన యేసయ్య "2"
నా గతిని చూపిన యేసయ్య
ఆత్మతో ఆరాదించనా నా యేసయ్య "4" "నీకేమి "
పాపము బరియెంచి మా శాపము తొలగించి
సిలువలో రక్తము కార్చి మమ్ము రక్షించావు"2"
నిత్యము జీవించె నిరీక్షణ
ఇచ్చిన యేసయ్య "2"
నిరీక్షణ ఇచ్చిన యేసయ్య
ఆత్మతో ఆరాదించనా నా యేసయ్య "4"
"నీకేమి"