Anukshanam anudinamu song lyrics | అనుక్షణం అనుదినము Song Lyrics - Latest Worship Song Lyrics
Singer | Bro. Nissy John |
అనుక్షణం అనుదినము నన్ను కాపాడుచున్నావు
నా ఆధారం నీవే - నా ఆశ్రయము నీవే
నీవే నీవే నా యేసయ్య - నీవే నీవే నా యేసయ్య
ఇరుకైన ఇబ్బందులేవైనా
కరువైన కష్టాల కొలిమైన
నీవు నాతో ఉన్నావు - నినువేడుకొనినప్పుడు
ఎబెనెజరువై - ఆదుకున్నావు
ఏ వ్యాధైనా అంధకారమయమైన
శ్రమ అయినా చావే ఎదురైనా
నీవు నాతో ఉన్నావు - నీ మాట వినినప్పుడు
ఇమ్మానుయేలువై - తోడై ఉన్నావు
నను పోషించి సర్వ సమృద్ధినిచ్చి
నా మార్గములో జీవపు వెలుగై ఉన్నావు
నీవు నాతో ఉన్నావు - నీ ఆత్మతో నింపావు
ఎల్ షడాయ్ వై- శక్తినిచ్ఛావు