Manasu Marchu song lyrics | మనసు మార్చు Song Lyrics - Telugu Christian Worship Song Lyrics
Singer | Jeeva |
నీతి సూర్య తేజోమయుడా
ధవళవర్ణుడ రత్న వర్ణుడ
పదివేలలో అతి శ్రేష్ఠుడా
శుద్ధుడా మహిమాన్వితుడు
మనసు మార్చు పరమ తండ్రి
నీదు ఆత్మతో నేను నిండా
మనసు మార్చు పరమ తండ్రి
నీదు రూపులో నేను మార
నీదు మహిమతో నేను నిండా
పనికిరాని పాత్రను నేను
పడిపోయిన పామరుండం
మంచిలేని పాపిని నేను
చీకటి నిండిన అపవిత్రుడను || మనసు ||
నీదు సన్నిధిన్ నేను వదలి
నీదు స్మరణను నేను మాని
మలినం నిండి మార్గము తప్పి
చెదరివున్న దోషాత్ముడను || మనసు ||
సౌఖ్యము కోరి క్షేమము మరచి
దైవ ఆజ్ఞన్ నేను విడిచి
కానరాని దూరం పోయి
ఒంటరినైనా అనాధుడను || మనసు ||