Type Here to Get Search Results !

Mahaneeyuda Parakrama Song Lyrics | మహనీయుడా పరాక్రమ కార్యములు Song Lyrics - Calvary Ministries Songs Lyrics

Mahaneeyuda Parakrama Song Lyrics | మహనీయుడా పరాక్రమ కార్యములు Song Lyrics - Calvary Ministries Songs Lyrics

Mahaneeyuda Parakrama Song Lyrics

మహనీయుడా పరాక్రమ కార్యములు కనపరచువాడ
మహాఘనుడా ఘనమైన కార్యములు జరిగించువాడ
విజయ ధ్వనులను వినిపించువాడా- విజయోత్సాహములో నడిపించువాడా
వర్ణించలేనయా నీ ఆశ్చర్యకార్యములు- వివరించలేనయా నీ అద్బుతకార్యములు
హల్లెలుయ హెల్లెలూయా.... హల్లెలుయ హెల్లెలూయా....
కొత్త కీర్తన పాడెదనూ గొప్ప స్వరముతో ఆరాధింతును

1) భీకరమైన మహిమను ధరించి - సర్వశక్తుడు మహాత్యము గలవాడు
ఉదయ తారలు ఏకముగా కూడి - దూతలందరు జయధ్వనులు చేయగ
బూమికి పునాది వేసినవాడవయా- నీ గొప్పకార్యములు వివరించలేనయా
హల్లెలుయ హెల్లెలూయా.... హల్లెలుయ హెల్లెలూయా....
కొత్త కీర్తన పాడెదనూ గొప్ప స్వరముతో ఆరాధింతును

2) ఆశ్చర్యమైనది నీ నిత్య సంకల్పం – అవధులు లేనిది నీ మహిమైశ్వర్యము
అనాదిలోనే నీ సిలువ మరణము - అమూల్యమైనది నీ రక్త బలియాగం
నీ ప్రాణ త్యాగము నే మరువలేనయా – నీ ప్రేమ లోతును నే కొలువలేనయా
హల్లెలుయ హెల్లెలూయా.... హల్లెలుయ హెల్లెలూయా....
కొత్త కీర్తన పాడెదనూ గొప్ప స్వరముతో ఆరాధింతును

3) అందమైనది నీ మహిమ లోకము - అతిసుందరము నీ నిత్య రాజ్యము
అంతములేనిది శాశ్వత లోకము - అద్బుతమైనది నీ రాజ్య సౌందర్యం
ఆ మహిమ లోకాన్ని వివరించలేనయా – నీ మహిమ తేజస్సు వర్ణించలేనయా
హల్లెలుయ హెల్లెలూయా.... హల్లెలుయ హెల్లెలూయా....
కొత్త కీర్తన పాడెదనూ గొప్ప స్వరముతో ఆరాధింతును

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area