Kananu Yatralona Song Lyrics | కనాను యాత్రాలోన Song Lyrics - Bro. Mathew Songs Lyrics
Singer | Bro. Mathew |
కనాను యాత్రాలోన కాపరివై నను కాచావు
నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు "2".
షేఖీన మేఘమా నా యేసయ్యా
కురిపించావు కృపామృతము నాపై "2" "కనాను "
1. ముందెన్నడు నేనెరుగని క్రొత్త మార్గములో ఊహించని కష్టాలు ఎదురైనా వేళలో "2"
కష్టాలలో నాకు వినయము నేర్పించి నను క్రమపరచి నీ చిత్తము నెరవేర్చావు"2" కనాను.
2 నా ఎడల నీకున్న ప్రణాళికను ఎరుగక హృదయములో కలవరపడి భయమొందితినయ్యా "2"
నా భారామంతయు నీ భుజములపై మోసి అత్యున్నత స్థానములో నను నిలిపావయ్యా"2" కనాను.
3 రాత్రి అగ్ని స్తంభమై నను కాచావు పగలు మేఘస్తంభమై నడిపించావు "2"
నావిరోధికి నీవు ఎదురే వెళ్ళావు నీ బాహుబలముతో నాకు జయమిచ్చావు "2" కనాను