Type Here to Get Search Results !

Ennikaleni nannu Song Lyrics | ఎన్నిక లేని నన్ను Song Lyrics - Nissy John Songs Lyrics

Ennikaleni nannu Song Lyrics | ఎన్నిక లేని నన్ను Song Lyrics - Nissy John Songs Lyrics

Singer Nissy John

ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు
కన్నీళ్లు తుడుచుటకు కన్నతండ్రివైనావు. ||2||
కలకాలం నివసించాలని నాతో నీవున్నావు
చిరకాలం జీవిస్తానని నీతో నేనుంటాను. ||2||

యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా
|| ఎన్నిక లేని నన్ను ||

ఎన్ని బాధలోచినా వేడిపోను యేసయ్యా
నీ చిత్తమే నన్ను బలపరిచెనయ్యా ||2||

ఊపిరి ఉన్నంతవరకు నీ నామ స్మరణయే
ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకే ప్రయాస ||2||

యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా
|| ఎన్నిక లేని నన్ను ||

లోకములో ఎందరు వున్నా ఒంటరినే నేనెపుడూ
నీతోడు నాకుండగా ఒంటరిని కాదెపుడు ||2||
ఈ జీవం నీవిచ్చినదే ఈ బ్రతుకు నీకే
ఈ దేహం నీవిచ్చినదే సర్వస్వం నీదే. ||2||

యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా
|| ఎన్నిక లేని నన్ను ||

మనుష్యులలో అందరికంటే అల్పుడనే నేనే
నీ కృపతో నన్నెంనుకున్నావు. ||2||
నేను నా ఇంటివారును నీ వారమేసయ్య
నా జీవిత కాలమంతయు నిన్నే సేవిస్తామయ్యా ||2||

యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా
|| ఎన్నిక లేని నన్ను ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area