Nee Siluve Nannu Marchindi Song Lyrics | నీ సిలువే నన్ను మార్చింది Song Lyrics - Sreerama Chandra Christian Songs Lyrics
Singer | Sreerama Chandra |
నీ సిలువే నన్ను మార్చింది
నీ త్యాగమే నన్ను బ్రతికించింది. "2"
నీ ప్రేమలో చిరకాలము -జీవింతును నీ సాక్షిగా
నీ సేవలో కలకాలము- ప్రకటింతును నీ ప్రేమను
" నీ సిలువే నన్ను"
చరణం 1:- నీ రక్త ధారలే నా పాప మరకలను
కడిగి పవిత్ర పరచెను యేసయ్యా "2"
రుధిరమంత నాకై ధారపోసావయ్య
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చెదనయ్య"2"
" నీ సిలువె"
చరణం 2:- నీవు పొందిన దెబ్బలే నా పాప రోగములను
విడిపించి రక్షించెను యేసయ్యా. "2"
పాపపరిహారార్ధ బలిగా బలియైనావయ్య
ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనాయ్యా "2"
"నీ సిలువే"