Yesuni Premanu Nemarakanu Song Lyrics | యేసుని ప్రేమను నేమారకను Song Lyrics - Telugu Songs Lyrics
Singer | Telugu Songs Lyrics |
యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలచవే యో మనసా
వాసిగ నాతని వర నామంబును వదలక పొగడవె యో మనసా
1. పాపుల కొరకై ప్రాణం బెట్టిన ప్రభునిల దలచవె యో మనసా
శాపమ నంతయు జక్కగ నోర్చిన శాంతుని పొగడవె యో మనసా
2. కష్టములలో మన కండగ నుండి కర్తను దలచవె యో మనసా
నష్టము లన్నియు నణచిన యాగురు శ్రేష్ఠుని పొగడవె యో మనసా
3. మరణతఱిని మన శరణుగ నుండెడు మాన్యుని దలచవె యో మనసా
కరుణను మన కన్నీటిని దుడిచిన కర్తను పొగడవె యో మనసా
4. ప్రార్ధనలు విని ఫలముల నొసగిన ప్రభునిక దలచవె యో మనసా
వర్ధన గోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవె యో మనసా
5. వంచనలేక వరముల నొసగిన వరదుని దలచవె యో మనసా
కొంచము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవె యో మనసా