Yehova Needu Mellulanu Song Lyrics | యెహోవా నీదు మేలులన్ Song Lyrics - Raj Prakash Paul Song Lyrics

Singer | Raj Prakash Paul |
యెహోవా నీదు మేలులన్ ఎలా వర్ణింపగలను
కీర్తింతున్ నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్యా పాపిని నేనయ్యా
నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నీవయ్యా జీవితం నీదయ్యా
నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణభూతుడా పరిశుద్ధుడా
నీదు ఆత్మతో నన్ను నింపు
మారనాథ ఏసునాధ
నీదు రాజ్యములో నన్ను చేర్చు
1, ఘనుడా సిల్వదరుడా
అమూల్యం నీదు రుధిరం "2"
నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం
నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం
ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం
సర్వోన్నతుడా నీకే సర్వం
2, ప్రియుడా ప్రాణ ప్రియుడా
వరమే నీదు స్నేహం "2"
నా రక్షణకై పరమును వీడే
నా విమోచనకై క్రయధానమాయే
ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం
పరమాత్ముడా నీకే సర్వం