Yesu Nee Tyagame Song Lyrics | యేసు నీ త్యాగమే Song Lyrics - New Telugu Christian Song Lyrics
Singer | Bro. Moses |
పల్లవి: యేసు నీ త్యాగమే
నా పాప శిక్షకై"2"
ఎన్నో నిందలు అవి నా కోసమా మలినమైన నా గతం ఇక లేదయా"2"
నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్యా"2"
1. బంధువులే భాధించెడబాసినా
నా వారే నన్నే అమ్మేసిన"2"
స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన
నన్ను ఒంటరిని చేసి రాళ్లు రువ్విన"2"
(నా జీవితమే)
2. బ్రతుకంతా చీకటి కమ్మేసిన
రక్కసి వేదనలే శోధించిన"2"
రోధనలే రోగమై వేధించిన
మరణాలు విలయాలు కబలించిన"2"
(నా జీవితమే)
3. బలహీనతలో నను బలపరిచిన
పాపినైన నాకై మరణించిన"2"
మృతమైన నన్ను మహిమగా మార్చిన
మారని నీ ప్రేమకై బానిసైనా"2"
నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్యా"2"...