Unnavaadavu Anuvaadavu Song Lyrics | ఉన్నవాడవు అనువాడవు నీవు Song Lyrics - Ps. Jyothi Raju Worship Song Lyrics

Singer | Ps. Jyothi Raju |
ఉన్నవాడవు అనువాడవు నీవు
నిన్న నేడు నిరతము మారని మా యేసయ్య (2)
అల్ఫాయు ఒమేఘాయు నీవే కదా
ఆధ్యంత రహితుడవు నీవే కదా (2)
హల్లెలూయా స్తోత్రార్హుడా – యుగయుగములకు స్తుతి పాత్రుడా (2) (ఉన్నవాడవు)
పలుకబడిన వాక్కుతో ప్రపంచములు నిర్మించితివి
మంటితో మమ్ముజేసి జీవాత్మను ఊదితివి (2)
మమ్మునెంతో ప్రేమించి మహిమతో నింపితివి
పరము నిండి దిగివచ్చి మాతో నడచితివి (2) (అల్ఫాయు)
పాపమంటియున్న మాకై మా పరమ వైద్యునిగా
నీ రుధిరం మాకై కార్చి ప్రాయశ్చిత్తం చేయగా (2)
మొదటి వాడా కడపటి వాడా జీవింపజేసితివే
నీదు ఆత్మతో నింపితివి మము సరిజేసితివి (2) (అల్ఫాయు)
ప్రతి వాని మోకాలు వంగును నీ నామమున
ప్రతి వాని నాలుక చాటును నీ మహిమను (2)
తరతరములకు మమ్మేలు వాడా -భూపతుల రాజువే
మేఘారూఢుడవై దిగివచ్చి – మహినేలు మహారాజువే (2) (అల్ఫాయు)