Type Here to Get Search Results !

Manasuna Vedanaa Song Lyrics | మనస్సున వేదన Song Lyrics - Dr. Asher Song Lyrics

Manasuna Vedanaa Song Lyrics | మనస్సున వేదన Song Lyrics - Dr. Asher Song Lyrics

Singer Dr. Asher

మనస్సున వేదన - ఉప్పెనై రేగెనా
మనస్సులో నెమ్మది - చిద్రమై పోయె నా
శోకమే దిగమింగినా - హృదయపు ఆవేదనా
బాధల మాటున - యాత్ర కీర్తన
గాయమును మాన్పు మా - గాయపడిన యేసయ్యా
ఆదరించగా రావా - ఆదరణకర్త దేవా
ప్రియ అదరణకర్త దేవా "మనస్సున"

1. విస్తారమైన భారముచే - మనసంతా కృంగెనెగా
బ్రతుకుదుము అన్న నిరీక్షణ - కోల్పోయి ఉండగా
మృతులను లేపు - దేవునియందే మాదు నిరీక్షణ
విమోచకుండు సజీవుడు - లేవనెత్తి మమ్ము బలపరచున్
నా విమోచకుండు సజీవుడు - లేవనెత్తి మమ్ము బలపరచున్
లేవనెత్తి మమ్ము బలపరచున్. "మనస్సున"

2. అసూయతో నన్ను ద్వేషించి - చేయని నేరమునే మోపి
అన్ని విధాల అంతము చేయ - నరమాత్రులెందరో యత్నించగా
యుద్ధము నాది ఊరకుండుడి - అనుమతించినది నేనే యని
యుద్దశూరుడా యేసయ్యా - శౌర్యముతో నన్ను నింపుమయ్యా(2)
నీ శౌర్యముతో నన్ను నింపుమయ్యా "మనస్సున"

3. కడదాకా నీతోనే యని - వెన్నంటే నీతో ఉంటానని
ఎంతగానో నన్ను నమ్మించి - వెన్ను పోటునే పొడిచారే
మారే మనిషిని నమ్ముటకంటే - యెహోవానాశ్రయించుట మేలు
మార్పు చెందని యేసయ్యా - మాన్పుమయ్య ఈ గాయమును(2)
మాన్పుమయ్య ఈ గాయమును "మనస్సున"

4. నిన్నే ప్రేమిస్తున్నానని - మనసంతా నీవే యని
చివరికి ఒంటరిగా జేసి - తీరని గాయమునే రేపిన
నన్ను నన్నుగా ప్రేమిస్తూ - శాశ్వత ప్రేమతో స్నేహించే
ప్రేమ స్వరూపి యేసయ్యా - మాన్పుమయ్య ఈ గాయమును(2)
మాన్పుమయ్య ఈ గాయమును. "మనస్సున"



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area