మార్గం నీవే Song Lyrics | Margam Neeve Song Lyrics - Revanth Christian Songs Lyrics
Singer | Revanth |
మార్గం నీవే , సత్యం నీవే , జీవం నీవే ... నీవే యేసు
నా మార్గం నీవే , నా సత్యం నీవే , నా జీవం నీవే ... నీవే యేసు
నా శ్వాసలోని ఊపిరి నీవే
నా గుండె చేసే చప్పుడు నీవే
నీవే యేసు ... నీవే యేసు ... నీవే యేసు ... నీవే ప్రభూ
1. అనామకుడనైన నన్ను పేరు పెట్టి పిలచితివీ - శిలనైయున్న నాకు సిలువ విలువ నిచ్చితివీ
తండ్రి తనయా .... శుద్ధాత్మా ...
వందనం ... వందనం...
ఓ వందనం ... ప్రభు వందనం
2. తండ్రి తనయునిగా నా తండ్రివైతివీ - నీ రాజ్యవారసునిగా నన్ను హెచ్చించితివీ
తండ్రి తనయా .... శుద్ధాత్మా ...
వందనం ... వందనం ...
ఓ వందనం ... ప్రభు వందనం
3. నాలో నీవు నీలో నేను ఓ జ్యోతి వోలె - నా జీవితములో నీవు హరివిల్లు వోలె
తండ్రి తనయా .... శుద్ధాత్మా ...
వందనం ... వందనం ...
ఓ వందనం ... ప్రభు వందనం