Nee rekkala needalo song lyrics | నీ రెక్కల నీడలో దాగుకొందునయ్యా Song Lyrics - Nissy John Christian Song Lyrics

Singer | Nissy John |
నీ రెక్కల నీడలో దాగుకొందునయ్యా
యుగయుగములు నీ గుడారములో నేను నివసింతును నీతోనే ఉందును
నీకే నీకే ఆరాధనా నీకే నీకే ఆరాధనా
1. నా వెనుక శత్రువులు నను తరిమిన నా ముందు సముద్రమే ఎదురొచ్చిన
నీ హస్తము చాపి శత్రువును తరిమి
ఆరిన నేలపై నడిపించినావు నీ రెక్కలపై నను మోసినావు
నీకే నీకే ఆరాధనా నీకే నీకే ఆరాధనా
2. సింహాల బోనులో నను వేసినా నా చావుకోసం ఎదురుచూసిన
నీ హస్తము చాపి సింహాల నోళ్లు మూసి
సజీవునిగా నను దాచినావు నీ రెక్కలపై నను మోసినావు
నీకే నీకే ఆరాధనా నీకే నీకే ఆరాధనా