Type Here to Get Search Results !

Naa prardhana lanni aalakinchinavu song lyrics | నా ప్రార్థనలన్ని ఆలకించినావు Song Lyrics - Ps. John Wesly Song Lyrics

Naa Prardanalanni Alakinchinavu Song Lyrics | నా ప్రార్థనలన్ని ఆలకించినావు Song Lyrics - Ps. John Wesly Song Lyrics

Singer Ps. John Wesly

నా ప్రార్థనలన్ని ఆలకించినావు
నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతును
నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను
నీ బానిసనై యుందును బ్రతుకు దినములన్నియు

చరణం 1 :
అడిగినంతకంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్య
పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభ ఆనవాలు

చరణం 2 :
ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్య
సమీప భాంధవ్యములన్నిటికన్నా మిన్నయైనది నీ స్నేహ బంధము

చరణం 3 :
ఎక్కలేనంత ఎతైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్య
ఆశ్చర్యకరమైన నీ ఆలోచనాలు ఆత్మీయతకే స్థిరపునాదులు



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area