Naa Atmiya Yatralo Song Lyrics | నా ఆత్మీయ యాత్రలో Song Lyrics - Hosanna Ministries Song Lyrics
Singer | Ps. Freddy |
నా ఆత్మీయ యాత్రలో అరణ్య మార్గములో
నాకు తోడైన నా యేసయ్యా
నిను ఆనుకొని జీవించెద
నేనేల భయపడుదు నా వెంట నీవుండగా
నేనెన్నడు జడియను నా ప్రియుడా నీవుండగ
నా ఆత్మీయ యాత్రలో అరణ్య మార్గములో
నాకు తోడైన నా యేసయ్యా
నిను ఆనుకొని జీవించెద
1. శ్రేష్ఠమైన నీ మార్గములో నిత్యమైన నీ బాహువు చాపి
సమృద్ధి జీవము నాకనుగ్రహించి
నన్ను బలపరచిన యేసయ్యా"2"
నిను హత్తుకొనగా నేటివరకు నేను సజీవుడను"2""నేనేల"
2. పక్షిరాజువలె పైకెగురుటకు
నూతన బలముతో నింపితివి
జ్యేష్థుల నంఘములో నను
చేర్చి పరిశుద్ధపరచే యేసయ్యా"2"
అనుదినము నిన్ను స్తుతించుటకు నేను జీవింతును"2""నేనేల"
3. సీయోను దర్శనము పొందుటకు
ఉన్నత పిలుపుతో పిలిచితివి
కృపావరములతో నను నింపి అలంకరిస్తున్న యేసయ్యా"2"
నీ రాక కొరకు వేచియుంటిని త్వరగా దిగిరమ్ము"2""నేనేల"