Type Here to Get Search Results !

Idigo Vinuma O Lokama Song Lyrics | ఇదిగో వినుమా ఓ లోకమా Song Lyrics - Bro. anil Song Lyrics

Idigo Vinuma O Lokama Song Lyrics | ఇదిగో వినుమా ఓ లోకమా Song Lyrics - Bro. anil Song Lyrics

Singer Bro. anil

ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను -2
సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2
మరనాతా... అ

ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను.. ఊ ఉ ఉ

1. మహా మహా ఆర్భాటముతో - ప్రధాన దూత శబ్దముతో
దేవుని బూరతో - ప్రభువు వేగమే దిగి వచ్చును - 2
ప్రభు నందు మృతులు లేతురు - సమాధులు తెరువగా
విస్వాసులంతా దాల్తురు - మహిమ రూపును వింతగా
ఎత్తబడును సంఘము - అయ్యో ! విడువబడుట ఘోరము ...

సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2
మరనాతా...... అ

ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను

2. ఏడేండ్లు భువిపై శ్రమ కాలం - ప్రాణాలు జారే భయ కాలం
బూరలు తెగుళ్ళు - దైవ ఉగ్రతా పాత్రలు -2
ఆకాశ శక్తుల్ కదులును -గతి తప్పును ప్రకృతి
కల్లోలమౌను లోకము - రాజ్య మేలును వికృతి
సంఘమెంతో హాయి రా - మధ్యాకాశాన విందు రా

సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2
మరనాతా...... అ

ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను

3. అన్యాయం చేయువాడు చేయునిమ్ము - అపవిత్రుడట్లే యుండనిమ్ము
పరిశుద్ధుడింకను - పరిశుద్దుని గుండనిమ్ము -2
ప్రతివాని క్రియల జీతము - ప్రభు తెచ్చును ఒక దినం
రహస్య క్రియలు అన్నియు - బయల్పడునులే ఆ దినం
లోక ధనము కూడిరా - నీకుంద పై సంపదా

సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2
మరనాతా...... అ

ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను

4. ఒలీవ కొండపై రారాజు - అడుగు పెట్టెడి ఆ రోజు
కొండయే చీలును - భూగోళమే కంపించును - 2
ప్రతి జనము ప్రభుని చూచును - ప్రతి జాతీయు మ్రొక్కును
నిజమైన ప్రభువు యేసని - ప్రతి నాలుక ఒప్పును
ప్రభుని రెండవ రాకడా - సాతానుకు దడ దడ

సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2
మరనాతా...... అ
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను

5. వెయ్యేండ్లు భువి పై ప్రభు యేసు - పాలించును పరిపాలించును
నీతి సమాధానం - ఆత్మ యందలి ఆనందం -2
ఈ భూమి దాని కృత్యముల్ - సమస్తము కాలిపోవున్
మిక్కటమైన వేడితో - పంచభూతముల్ లయమగున్
కొత్త భూమి ఆకాశం - ఇంక శాశ్వత జీవితం

సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2
మరనాతా...... అ
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను

6. క్రీస్తేసును విస్వసించువారే -పరిశుద్ధులుగ తీర్చబడ్డవారే
దేవుని మహిమకు - నిత్య జీవమునకు అర్హులు -2
జీవం మరణం రెండును - నీ ఎదుటనే యున్నవి
ప్రభు యేసే జీవామార్గమని - నీకు తెలుపబడి యున్నది
విశ్వసించు ప్రియుడా - కాదు తక్కెడోపిక్కడా

సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2
మరనాతా...... అ
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను - 2
సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా...... అ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area