Abba Thandri Ani Song Lyrics | అబ్బా తండ్రి అని ప్రార్థించెదము Song Lyrics - Telugu Prayer Song Lyrics
Singer | Unknown |
అబ్బా తండ్రి అని ప్రార్థించెదము
విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము
1. విశ్వాస ప్రార్ధన రోగిని స్వస్థపరుచును
ఏకాంత ప్రార్ధన ఆత్మను బలపరుచును - 2
కన్నీటి ప్రార్ధన కనికరము పుట్టించును. || అబ్బా||
2. ఉపవాస ప్రార్ధన ఉజ్జీవం కల్గించును
సహవాస ప్రార్ధన చెర నుండి విడిపించును - 2
ఆత్మలో ప్రార్ధన అభిషేకం నింపును. || అబ్బా||
3. కనిపెట్టు ప్రార్ధన దర్శనము కల్గించును
విజ్ఞాపనా ప్రార్ధన ఆత్మలను కాపాడును - 2
ఆసక్తితో ప్రార్ధన అద్భుతములు జరిగించును. || అబ్బా||