Gadandhakaramulo Ne Nadachina Song Lyrics | గాఢాంధకారములో నే నడచిన Song Lyrics - Worship Song Lyrics
Singer | Unknown |
గాఢాంధకారములో నే నడచిన వేళలో (2)
కంటి పాపవలె నన్ను కునుకక కాపాడును (2)
ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్
జడియను బెదరను – నా యేసు నాకుండగా (2)
అలలతో కొట్టబడిన – నా నావలో నేనుండగా (2)
ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును (2)
అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును
జడియను బెదరను – నా యేసు నాకుండగా (2)
మరణంపు లోయలలో - నే నడచిన వేళలలో
నీ దుడ్డుకర్రయు నీ దండమాదరించును
నా గిన్నె పొర్లుచున్నది శుద్ధాత్మతో నింపెను
జడియను బెదరను నా యేసు నాతోనుండగ