Aradhana pallakilo Song Lyrics | ఆరాధన పల్లకిలో Song Lyrics - Emmanuel Ministries Song Lyrics
 
	
	| Singer | Nissy John | 
పల్లవి : 
ఆరాధన పల్లకిలో మహారాజు యేసయ్య 
ఆరాధింతును ఆనంద గీతముతో ( 2 )
అ.ప : 
నిన్ను ఆరాధింతును 
నిన్ను సేవింతును 
నాలో ప్రాణము ఉన్నంత వరకు ( 2 )
చరణం 1: 
కాలిన అరణ్యములో కాలినడక బాటలో
కరుణ గల దేవుడవై నను స్నేహించావు ( 2 )
కన్నీళ్లు తుడిచావు 
కవిలలో వ్రాసావు 
కొదువలన్నియు తీర్చి 
సమృద్ధి నిచ్చావు ( 2 )
కృపా క్షేమమే నొసగి 
నన్నాదరించావు ( 2 ) || నిన్ను ||
చరణం 2 : 
ఆశ్చర్య కార్యములెన్నో అనుభవింప జేయుటకై 
అదముడైన యాకోబును పిలుచుకొంటివి ( 2 )
వాక్యమును యాకోబుకు తెలియజేసినావు
వాగ్దాన భూమిని స్వాస్థ్యముగా నిచ్చావు 
అధిక బహుమానమును కలుగజేసినావు ( 2 )    || నిన్ను ||
చరణం 3: 
తరతరములన్నిటను నీ నామ జ్ఞాపకముగా 
తెలియజేయుటకు మమ్ము ఏర్పరచుకొంటివి ( 2 )
సైన్యములకధిపతికి సూచనలు గాను 
సర్వలోకనాధునికి యాజకులు గాను ( 2 )
దయచేతనే నీవు కృప చూపుచున్నావు
దయచేతనే మా యెడ కృప చూపుచున్నావు|| నిన్ను ||

