Vinipinchana Na Hrudaya geetham Song Lyrics | వినిపించనా నా హృదయగీతం Song Lyrics | Madhuram Nee Jananam Lyrics
Singer | Sharon Sisters |
వినిపించనా - నా హృదయగీతం - నీ జోలపాటగా
వర్ణించనా - నాప్రేమకావ్యం - నీ లాలిపాటగా
సీయోనురాజా - షాలేము ప్రభువా- మధురం మధురం - నీ జననం
పరిశుద్ధ ప్రియుడా - పరమాత్మ వరుడా - సుమం సుమం- ఈ ఉదయం
మధురం మధురం - నీ జననం సుమం సుమం- ఈ ఉదయం
|| వినిపించినా||
బెత్లేహేము నగరిలో - నీవు అరుణోదయం
కన్య మరియమ్మతల్లి- నీకు శుభోదయం
పరవశించి దూతలంతా - ప్రణుతలనే చేయగా
అందాలతార జోలపాటలే - పాడేగా జోలాలి
ఆ అందాలతార జోలపాటలే - పాడేగా జోలాలి
||మధురం వినిపించినా||
పశువుల పాక పవలించే- షారోను పద్మం
కాపరుల దర్శనం ఈ సువార్త - పరిమళం
సర్వ జనులు ప్రణమిల్లి -ప్రస్తుతింపగా
రా రాజులే నీకు నీరాంజనములే - పలికేగా యేసయ్య
||మధురం వినిపించినా||
కృపాకనికరముధరించిన - నీ శిరస్త్రాణం
తూర్పు దేశ జ్ఞానుల మార్గం - నీ దయార్ద్ర హృదయం
బంగారు సాంబ్రాణి బోళములు - సమర్పణలుగా ఇవ్వగా
బంగారు వరుడై ఈ భువికి - నీవు అలరారేగా
మా బంగారు వరుడై ఈ భువికి - నీవు అలరారేగా
||మధురం వినిపించినా||