Vinava Manavi Song Lyrics | వినవా మనవి యేసయ్య Song Lyrics - Thrahimam Songs Lyrics
Singer | Swetha Mohan |
వినవా మనవి యేసయ్య
ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం
పగిలెను జీవితం
చేసుకో నీ వశం
వినవా ప్రభువా
1.లోక స్నేహమే కోరి దూరమైతిని
వీడిపోయి నీ దారి ఓడిపోతిని
విరిగిన మనస్సుతో నిన్ను చేరాను
చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా
నా తండ్రి నీవేనయ్యా
2.ఆశ యేది కనరాక బేలనైతిని
బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూశాను
చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా
నా దైవము నీవయ్యా