Neevanti Prema Neevanti Krupa Song Lyrics | నీవంటి ప్రేమ నీవంటి కృపా Song Lyrics - Latest Telugu Christian Song Lyrics

Singer | KY Ratnam and Surya Prakash |
నీవంటి ప్రేమ, నీవంటి కృపా
నేను చూడలేధయా, నేను చూడలేనయా
యేసయ్యా…నీవంటి త్యాగం, నీవంటి కరుణా
ఎన్నడు చూడలేధయ, ఎక్కడ కానరాధయ
యేసయ్యా నీవంటి ప్రేమా, నేను చూడలేధయా, నేను చూడలేనయా
యేసయ్య నీవంటి కృపా , ఎవ్వరు చూపలేదయ, ఎవ్వరు చూపలేరయ
నీవంటి ప్రేమ, నీవంటి కృపా
నేను చూడలేధయా, నేను చూడలేనయా
యేసయ్యా…నీవంటి త్యాగం, నీవంటి కరుణా
ఎన్నడు చూడలేధయ, ఎక్కడ కానరాధయ
ధేనికి యోగ్యత లేని నాకై, పరమునుండి భువికి దిగివచ్చితివే...
నీ రక్తములో నను కడిగి, నన్ను నీ రాజ్యమునకు చేర్చితివే...2
యేసయ్యా నీవంటి త్యాగం, నేను చూడలేధయ నేను చూడలేనయ
యేసయ్యా నీవంటి కరుణా, ఎన్నడు చూడలేదయ, ఎక్కడ కానరాధాయ || నీవంటి ప్రేమ||
పాపములో పడి ఉన్న నన్ను, నీ కృపా తో లేవనెత్తావు
నే నశించుట ఇష్టము లేక, నా భదులుగా నీవు బలి అయితివే - 2
యేసయ్యా నీవంటి కృపా, నేను చూడలేధయ నేను చూడలేనయ
యేసయ్యా నీవంటి ప్రేమా, ఎన్నడు చూడలేధయ, ఎక్కడ కానరాధయ || నీవంటి ప్రేమ||
బలహీనమైన నన్ను, నీ ఆత్మతో బలపరిచావు
నీ ప్రేమను ప్రకటించుచు, నా పాపములను భరించావు - 2
యేసయ్యా నీవంటి ప్రేమా , నేను చూడలేధయ నేను చూడలేనయ
యేసయ్యా నీవంటి కృపా, ఎన్నడు చూడలేదయ, ఎక్కడ కానరాధాయ || నీవంటి ప్రేమ||