Unnavaadu Devudu Song Lyrics | ఉన్న వాడు మన దేవుడు Song Lyrics - New Year Song Lyrics
Singer | Anveshitha |
ఉన్న వాడు మన దేవుడు
ప:- ఆదికాలం నుండి అనంతకాలం వరకు ఉన్న వాడు దేవుడు ||2||
అ.ప:- గడచిన కాలం కాపాడినాడు
నూతన కాలముతో దీవించినాడు
కాలానికి అతితుడు ఆ దేవుడు
కలకాలం ఉండువాడు మన దేవుడు
క్షెమ కాలము శ్రమలకాలము ||2||
1.
ఆయుష్కాలము మనిషికి ఇచ్చాడు
స్వల్ప కాలం శ్రమపడమన్నాడు ||2||
క్షేమ కాలము శ్రమ కాలము
దేవుడిచ్చిన గొప్ప వరములన్నాడు
కాలము నెరిగి ఫలియిచింతే
నీత్య రాజ్యము వాగ్దానము చేసినాడు ||2||
||గడచిన కాలం||
2.
క్రొత్త సృష్టిగా క్రీస్తులో చేసాడు
కృప వెంబడి కృప చూపుచున్నాడు ||2||
క్షేమకరము కృపావరము
నీకై ఇచ్చిన నేటి దినములన్నాడు
ప్రభువు నందు ఫలియించితే
పరమజీవము వాగ్దానము చేసినాడు ||2||
||గడచిన కాలం||