బెత్లెహేము పురమందున Song Lyrics | Bethlehemu Puramanduna Song Lyrics - Latest Christmas Song Lyrics
Singer | Anjana sowmya |
పల్లవి: బెత్లెహేము పురమందున - రారాజు పుట్టాడంట
రారండి జనులారా - రక్షకుని చూసొద్ధాం.....
ఆడి పాడి ఆనందిద్దాం.......
బెత్లెహెము పురమందున - రారాజు పుట్టాడంట
రారండి జనులారా - ఆడి పాడి ఆనందిద్దాం : 2 సార్లు
కలిసి మెలిసి పోదాం - రక్షకుని చూసొద్ధాం : 2 సార్లు
అ.ప: ఆనందం పరమానందం - నింగీ నీలా పరవశం :2 సార్లు: (బెత్లె )
1 చ: గొల్లలకు శుభవార్త - అభయమిచ్చి దూత చెప్పింది
దావీదు పురమందు - రక్షకుండు పుట్టాడని :2 సార్లు
దివియందు దేవునికి మహిమ - భువియందు సమాధానం :2 సార్లు
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం : ఆనందం : (బెత్లె)
2 చ: పాపాల వలయంలో - మనుజులు పడివున్నప్పుడు
పాపాన్ని రూపుమాప - పరిశుద్ధుడు ఇలకేతెంచెన్ :2 సార్లు
కన్య మరియ గర్భాన్న - మనుజావతారుడై పుట్టెన్ :2 సార్లు
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం : ఆనందం: ( బెత్లె)
3 చ: నింగిలో వింతైన తారా - జ్ఞానులకు దారి చూపింది
రారాజుని గాంచి - కానుకలు అర్పించి పూజించిరి : 2సార్లు
రారాజు జననం మానవాళికే వరం - విరోధికే కలవరం : 2సార్లు
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం : ఆనందం : ( బెత్లె).