Type Here to Get Search Results !

Koniyada Tharame Ninnu Song Lyrics | కొనియాడఁ దరమె నిన్ను Song Lyrics - Old Christmas Song Lyrics

Koniyada Tharame Ninnu Song Lyrics | కొనియాడఁ దరమె నిన్ను Song Lyrics - Old Christmas Song Lyrics

Singer Sudha

1.కొనియాడఁ దరమె నిన్ను కోమల హృదయ కొనియాడఁ దరమె నిన్ను
తనరారు దినకరుఁ బెనుతారలను మించు
ఘనతేజమున నొప్పు కాంతిమంతుఁడ వీవు ||కొనియాడ||

2.ఖెరుబులు సెరుపులు మరి దూతగణములు
నురుతరంబుగఁ గొలువ నొప్పు శ్రేష్ఠుఁడ వీవు ||కొనియాడ||

3.సర్వలోకంబులఁ బర్వు దేవుఁడ వయ్యు
నుర్వి స్త్రీ గర్భాన నుద్భవించితి వీవు ||కొనియాడ||

4.విశ్వమంతయు నేలు వీరాసనుఁడ వయ్యుఁ
పశ్వాళితోఁ దొట్టిఁ పండియుంటివి నీవు ||కొనియాడ||

5.దోసంబులను మడియు దాసాళిఁ గరుణించి
యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు ||కొనియాడ||

6.నరులయందునఁ గరుణ ధర సమాధానంబు
చీరకాలమును మహిమ పరఁగఁ జేయుదు వీవు ||కొనియాడ||

7.ఓ యేసు పాన్పుగ నా యాత్మఁ జేకొని
శ్రేయముగ బవళించు శ్రీకర వరసుత ||కొనియాడ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area