నీ కృప చేతనే నను బ్రతికించితివి Song Lyrics | Nee Krupa Chethane Song Lyrics - Ps. Anand New Year Song Lyrics
Singer | Ps. Anand |
నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా
ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం
నా కన్న తల్లికన్నా నన్నెంతో ఆదరించితివి
నా కన్న తండ్రికన్నా భారము భరించితివి
శిలువలో వ్రేలాడుచూ నా చేయి విడువలేదు
ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి
ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను
ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం
నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా
ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా
నీకెందుకూ పనికిరాని పాత్రను నేనయ్యా
నను విసిరేయక సారెపై ఉంచితివి
కనికర స్వరూపుడా ఆలోచనాకర్తవు
నీ కొరకే చేసుకొంటివి నిను ప్రకటించే పాత్రగా
ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం
నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా
ఈ లోక మర్యాదలో నను నడువ నియ్యక పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి
గమ్యము చేరే వరకు అలసి పోనీకుమా పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో
రానున్న దినములలో కృప వెంబడీ కృప దయ చేయుమా
ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం
నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా