సంవత్సరాది మొదలుకొని Song Lyrics | Samvatsraadi modalukoni Song Lyrics - New Year Telugu Christian Song Lyrics

Singer | Honey |
సంవత్సరాది మొదలుకొని
సంవత్సరాంతమువరకు కాచావు (2)
కనుపాపవలె కాచి నీ కౌగిలిలో చేర్చి (2)
కాచావు, భద్రపరిచావు, కృపచూపావు, వందనం
కాచావు, భద్రపరిచావు, బ్రతికించావు, వందనం...
(అ.ప)
నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే
నీవేలేని ఒక అడుగైనా నే వేయలేనే...
చ:1
కన్నీళ్లలో కష్టాలో కడగండ్లలో కృంగిన వేళలో (2)
(నన్ను) ఆదరించావు...
(నా) చెంత నిలిచావు... ఆదుకున్నావు... కన్నీరు తుడిచావు (2) (నీవేలేక)
చ:2
ఆరోగ్యమే క్షీణించగా, ఆవేదనే ఆవరించగా (2)
(నన్ను) స్వస్థపరిచావు
(నీ) శక్తినిచ్చావు లేవనెత్తావు..ఆయుష్షు పెంచావు (2) (నీవేలేక)
చ:3
సంవత్సరములు జరుగుచుండ, నీ కార్యములు నూతనపరచుము (2)
మహాకార్యములను జరిగించుము మహాభీకరుండ మహిమరాజా (2) నీవేలేక)
చ:4
ప్రభువా దేవా ఈ జీవితం, నీ పాదసేవకే ఇల అంకితం (2)
సమాధానవార్తను ప్రకటింతును భీకరకార్యములను జరిగింతును (2) నీవేలేక)