తొలకరి కురిసే వెలుగుదాయించే Song Lyrics | Tholakari Kurise Song Lyrics - Calvary Akshaya New Year Song Lyrics
Singer | Sis. Akshaya |
తొలకరి కురిసే వెలుగుదాయించే తేజరిల్లే సంవత్సరం
వేదన తొలిగే వేకువ వెలుగై ప్రకాశించే సంవత్సరం (2)
కరుణ కటాక్షము దయా కిరీటము ధరింప చేసే హితవత్సరం
సంపూర్ణమైన బహుమానము దీవెనగా ఇచ్చే సంవత్సరం
( తొలకరి )
1. ఒంటరి ఐనా వాడు వెయ్యి మంది గా మారును
ఎన్నిక లేని వాడు బలమైన జనముగా మారును (2)
ఈ కార్యము ఈ కాలంలో స్థిరపడి నెరవేరును (2)
( తొలకరి )
2. స్వస్థత నీకు మరల శీఘ్రముగనే వచ్చును
సత్య సమాధానమును సమృద్ధిగానే ఇచ్చును (2)
ఈ కార్యము ఈ కాలంలో స్థిరపడి నెరవేరును (2)
( తొలకరి )
3. ఎండిన భూమి మీద ప్రవాహ జలములు పారును
దప్పిక గల వారి మీద నీరు ప్రవహింపబడును (2)
ఈ కార్యము ఈ కాలంలో స్థిరపడి నెరవేరును (2)
( తొలకరి )