నాకున్న ఆధారం నీవేనని Song Lyrics | Nakunna Adhaaram Song Lyrics - Bro. Stevenson Worship Song Lyrics
Singer | Bro. Stevenson |
నాకున్న ఆధారం నీవేనని
నీపై నా నిలిచిన నేను పడిపోనని “2”
చాటించెద యేసయ్య సాక్షిగా బ్రతికించుమయా “2”
మనుషులు ఇల మారవచ్చును
మమతలు పొగ బారవచ్చును “2”
మార్పులేనివాడవు నీవని సత్య ప్రేమరూపీవని “2”
చాటించెద యేసయ్య సాక్షిగా బ్రతికించుమయా “2”“నాకున్న”
కట్టడాలు కూలవచ్చును
భూమి నడుమ ఛీలా వచ్చును “2”
శ్రేష్టమైన పునాది నీవని క్షేమ మిచ్చు కేడమని “2”
చాటించెద యేసయ్య సాక్షిగా బ్రతికించుమయా “2” “నాకున్న”
సహాయాలు ఆగ వచ్చును
శత్రువు చెలరేగ వచ్చును“2”
నమ్మదగిన దేవుడవు నీవని ఆదరించువాడవని “2”
చాటించెద యేసయ్య సాక్షిగా బ్రతికించుమయా “2” “నాకున్న