కళ్ళు తెరుచుకో Song Lyrics | Kallu Theruchuko Song Lyrics - Bro. Stevenson Song Lyrics
Singer | Bro. Stevenson |
కళ్ళు తెరుచుకో... ఈ నిజం తెలుసుకో... "2"
నీ గర్వాన్ని విడిచి కరుణించని దేవుని వేడుకో... "2"
నీకు నీవుగా చేసే... నీ సొంత ప్రయత్నాలు...
దేవుని కృప లేకుండా సఫలము కానేకావు...
" కళ్ళు తెరుచుకో "
1) నీ దగ్గర ధనం ఉంటే...
మందులు కొనగలవేమోగాని...
ఆయుష్కాలము పొడిగించుకొనుట...
సాధ్యం కాని పని... "2"
ఆరోగ్యము దేవుని వశము...
యేసే క్షేమమా దారము... "2"
" నీకు నీవుగా "
2) నీ దగ్గర ధనముంటే...
పరుపులు కొనగలవెమోగాని...
సరియగు నిద్రను రప్పించుకొనుట...
సాధ్యం కాని పని... "2"
విశ్రమము దేవుని వశము...
యేసే ప్రాణాధారము... "2"
" నీకు నీవుగా "
3) నీ దగ్గర ధనముంటే...
మనుషుల కొనగలవేమోగానీ...
అనుబంధాలను నిలబెట్టుకొనుట...
సాధ్యం కాని పని... "2"
ఆత్మీయత దేవుని వశము...
యేసే ప్రేమ ధరము... "2"
" నీకు నీవుగా "