Nuthana Srushtiga nanu marchi Song Lyrics | నూతన సృష్టిగ నను మార్చి Song Lyrics - Nissy John New Year Song Lyrics
Singer | Nissy John |
నూతన సృష్టిగ నను మార్చి
నిత్య జీవము నాకొసగి "2"
నీ సాక్షిగా ఇల నిలిపితివి
నీకే స్తోత్రము యేసయ్యా "2"
1. గత కాలమంతా కాపాడి
నీ రెక్కల చాటున దాచితివి "2"
కష్టాలలో కడగండ్లలో
తోడై నను నడిపించితివి "2". ll నూతన ll
2. బలహీతలో నీ కృప చూపి
అనుదినము నను బలపరచితివి "2"
వ్యాధులలో బాధలలో
స్వస్థతను సమకూర్చితివి "2" ll నూతన ll
3. నూతన వత్సరమును మాకిచ్చి
వాగ్దానములెన్నో చేసితివి "2"
ప్రతి స్థితిలో ప్రభావముతో
నడిపించుమయా నాజరేయా "2" ll నూతన ll