Devudu ichina oka Song Lyrics | దేవుడు ఇచ్చిన ఒక బహుమానం Song Lyrics - KY Ratnam New Year Song Lyrics
Singer | Sruthi |
"దేవుడు ఇచ్చిన ఒక బహుమానం
నూతనవత్సరమనే కిరీటం" "2"
"ఉత్సహించి సంతసించెదం
ఆనందముతో ఆరాధించెదం" "2"
" దేవుడు ఇచ్చిన "
1."మరణదూత సంచరించిన
వ్యాధులెన్నో చుట్టుముట్టిన" "2"
"కాపాడెను ప్రభువు తనకృపలో
కాచెను గతకాలం కంటిపాపలా" "2"
" దేవుడు ఇచ్చిన "
2."కరువుకాటకాలెదురైన
బ్రతుకుదెరువు కోల్పోయిన" "2"
"పోషించెను ప్రభువు తన కృపలో
సమృద్ధినిచ్చెను ప్రతిస్థితిలో" "2"
" దేవుడు ఇచ్చిన "
3."సంవత్సరమంత నీ కృపలో
మమ్ము కాయుము ఓ ప్రభువ" "2"
"ఇమ్మానుయేలుగ మా కాపరివై
నడిపించుము ఓ దేవా
నీ దయతో" "2"
" దేవుడు ఇచ్చిన "