Yehova naku velugaye Song Lyrics | యెహోవా నాకు వెలుగాయె Song Lyrics - Old Christian Song Lyrics
Singer | Sis. Blessy Wesly |
యెహోవా నాకు వెలుగాయె
యెహోవా నాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమయ్యె
నేను ఎవరికీ ఎన్నడు భయపడను – (2)
నాకు మార్గమును ఉపదేశమును
ఆలోచన అనుగ్రహించే (2)
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో
స్తుతి గానము చేసెదను (2) ||యెహోవా||
నా కొండయు నా కోటయు
నా ఆశ్రయము నీవే (2)
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో
స్తుతి గానము చేసెదను (2) ||యెహోవా||
నా తల్లియు నా తండ్రియు
ఒకవేళ విడచినను (2)
ఆపత్కాలములో చేయి విడువకను
యెహోవా నన్ను చేరదీయును (2) ||యెహోవా||