Premamaya yesu prabhuva Song Lyrics | ప్రేమమయా యేసు ప్రభువా Song Lyrics - Hosanna Ministries Song Lyrics
Singer | Bro. Abraham |
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా -2
అనుదినమూ - అనుక్షణము -2
నిన్నే స్తుతింతును ప్రభువా -2
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా
ఏ యోగ్యత లేని నన్ను
నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా -2
నన్నెంతగానో ప్రేమించినావు -2
నీ ప్రాణమిచ్చావు నాకై -2
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా || ప్రేమమయా ||
ఎదవాకిటను నీవు నిలచి
నా హృదయాన్ని తట్టావు ప్రభువా -2
హౄదయాంగణములోకి అరుదెంచినావు -2
నాకెంతో ఆనందమే -2
ప్రేమమయా యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును ప్రభువా || ప్రేమమయా ||
శోధనలు నను చుట్టుకొనినా
ఆవేదనలు నను అలుముకొనినా -2
శోధన, రోదన ఆవేదనలో -2
నిన్నే స్తుతింతును ప్రభువా -2 || ప్రేమమయా ||