Neethi gala Yehova Song Lyrics | నీతిగల యెహోవ Song Lyrics - Andhra Kraisthava Keerthanalu Lyrics
Singer | Sis, Crisi |
నీతిగల యెహోవ స్తుతి మీ – యాత్మతో నర్పించుడి – మీ యాత్మతో సేవించుడి
దాతయౌ మన క్రీస్తు నీతిని – దాల్చుకొని సేవించుడి || నీతి ||
1. చదలఁ బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగా
సదమలంబగు దైవ నామము – సర్వదా నుతిఁజేయను || నీతి ||
2. సర్వశక్తుని కార్యములకీ – సర్వ రాష్ట్రము లన్నియు
గర్వములు విడి తలలు వంచుచు – నుర్విలో నుతిఁజేయను || నీతి ||
3. గీత తాండవ వాద్యములచేఁ – బ్రీతిపరచెడు సేవతో
పాతకంబులు పరిహరించెడు – దాతనే సేవించుఁడి || నీతి ||
4. పరమదూతలు నరులు పుడమిని – మొరలు బెట్టుచు దేవుని
పరము నందున్నట్టి యేసుని – పాదములు సేవింతురు || నీతి ||
5. ఇలను భక్తులు గూడుకొనియా – బలము గల్గిన దేవుని
వెలయు స్తుతి వే నోళ్లతోడను – విసుగు జెందక జేయుడి || నీతి ||
6. ఆత్మ నీవిఁక మేలుకొని శు – ద్దాత్మఁ యేసుని దండ్రిని
త్రిత్వమగునా యేక దేవుని – హర్షమున సేవింపవే || నీతి ||
Neethi gala yehova song lyrics in English
Neethi gala Yehova sthuthi mee- yaatma tho narpinchudi-mee yathma tho savinchudi Ddatha yow mana Kreesthu neethini-dalchukoni savinchudee//neethi//
1.chadala budamiyu raviyu jaladhiyu-nadulu girulunu
jakkaga=sadamalambagu daivanamamu-sarvada nuti
jeyanu//neethi//
2.sarvashakhtni karyamula kee-sarva rashtramu
lanniyu=garvamulu vidi thalalu vanchuchu-nurvilo nuthi
jeyanu//neethi//
3.geetha thandava vadyamulache- breethi parachedu
sevatho=pathakambulu pariharinchedu-dathane sevinchudi //neethi//
4.paramadoothalu narulu budamini-moralu bettuchu devuni=paramu nandunnatti Yesuni -padamulu sevinturu//neethi//
5.yilanu bhaktulu goodukoni ya – balamu galgina devuni=velayu sthuti venolla thodanu-visugu jendaka
jeyudi//neethi//
6.aatma neevika melukoni shu-ddhatma Yesuni
dandrini=3Dtritvamagu na yeka devuni-harshamuna
sevimpave//neethi//