వెలలేని స్తోత్రములయ్యా Song Lyrics | VELALENI STOTRAMULAYYA Song Lyrics - Bro. Yesu Babu | Telugu Worship Song Lyrics
Singer | Bro. Yesu Babu |
పల్లవి: వెలలేని స్తోత్రములయ్యా
మహిమ ఘనత నీకేనయ్యా "2"
మహిమోన్నతుడా సర్వోన్నతుడా
ఉన్నత స్థలములపైన ఉన్న దేవుడా "2"
నీకే నీకే స్తోత్రములయ్య "4" ( వేలలేని)
1. ఎవరూ తోడు లేక ఏదిక్కు దశ లేక ఒంటరినై తిరుగుచున్న నన్ను
పలుమార్లు పలకరించి నా దరికి చేరినావు
నా కన్నీళ్లను తుడిచి వేసినావు "2"
ఆ పరమును విడిచి ఈ దీవికి వచ్చినావు"2" (నీకే)
2.విసిరేసిన విస్తరాకునై పారవేయబడితిని
నా స్థితిగతులను మార్చివేసినావు
కనుపాపలాగా కాచి చంటిపాపలాగ పెంచి నేను అడగకుండా అన్ని ఇచ్చినావు"2"
ఆ పరమును విడిచి నా కొరకు వచ్చినావు"2" (నీకే)