అందరిలోను ఉన్నావు Song Lyrics | Andharilonu Unnavu Song Lyrics - Anjana sowmya | Telugu Christian Worship Song Lyrics
Singer | Anjana sowmya |
పల్లవి:అందరిలోను ఉన్నావు - అన్నీ నీవై ఉన్నావు.
విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు.
అనుపల్లవి:యేసయ్య.. మా మనసే నీదయ్యా.
యేసయ్య.. మా మనవే వినవయ్యా...
1వ చరణం:
పువ్వులలోన.. ఉన్నావు.. నవ్వులలోన.. ఉన్నావు...
ఏ ఇద్దరు నీ పేరున కూడితే అక్కడ నీవే ఉంటావు.
|| యేసయ్య ||
2 వ చరణం:
ఉపకారములో ఉన్నావు-సహకారములో ఉన్నావు.
అనుదినము మా ఆహారములో భాగము నీవై ఉన్నావు.
|| యేసయ్య ||
3 వ చరణం:
దీనుల కొరకై ఉన్నావు.. అనాధుల కోసం ఉన్నావు..
కరుణామయుడా దయ చూడండి ఇట్టే ఆ దరి చేరుస్తావు..
|| యేసయ్య ||
4 వ చరణం:
రోగుల మధ్యన ఉన్నావు... పాపాత్ములకై ఉన్నావు...
బోధకుడా నువు మము బ్రోవంటే - ప్రేతాత్మలనే తరిమేస్తావు.
|| యేసయ్య ||
యేసయ్య నా మనసే నీదయ్యా..
యేసయ్య నా మనవే వినవయ్యా..