Nee Swaramu Vinipinchu Song Lyrics | నీ స్వరము వినిపించు ప్రభువా Song Lyrics - Bro. Asher Song Lyrics
Singer | Bro. Asher |
నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్ || 2 ||
నీ వాక్యమును నేర్పించు
దాని యందు నడుచునట్లు నీతో || 2 ||
|| నీ స్వరము ||
1. ఉదయమునే లేచి నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము || 2 ||
దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు
రక్షించు ఆపదల నుండి || 2 ||
|| నీ స్వరము ||
2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు
నేను సరిచేసుకొందు || 2 ||
నీ మార్గములో నడుచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడు || 2 ||
|| నీ స్వరము ||
3. భయ భీతులలో తుఫానులలో
నీ స్వరము వినిపించుము || 2 ||
అభయము నిమ్ము ఓ గొప్ప దేవా
ధైర్య పరచుము నన్ను || 2 ||
|| నీ స్వరము ||
4. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే || 2 ||
నీతో మనుష్యులతో సరి చేసి కొందు
నీ దివ్య వాక్యము ద్వారా || 2 ||
|| నీ స్వరము ||
5. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది
అది రెండంచులుగల ఖడ్గం || 2 ||
నీ వాక్యమేగా అద్భుత అద్దం
నిజ స్వరూపమును చూపించున్ || 2 ||
|| నీ స్వరము ||
6. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో || 2 ||
నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో
నీ యందు నిలుచునట్లుగా || 2 ||
|| నీ స్వరము ||
7. నా హృదయములోని చెడు తలంపులను
ఛేదించు నీ వాక్యము || 2 ||
నీ రూపమునకు మార్చును నన్ను
నీదు మహిమ కొరకేగా || 2 ||
|| నీ స్వరము ||