Dhoota Pata Padudi Song Lyrics | దూత పాట పాడుడీ Song Lyrics - Andhra christian Hymn Lyrics

Singer | Andhra christian Hymn |
1.దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ
ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేము నందునన్
భూజనంబు కెల్లను సౌఖ్యసంభ్ర మాయెను
ఆకసంబునందున మ్రోగు పాట చాటుఁడీ
దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ.
2.ఊర్ధ్వలోకమందునఁ గొల్వఁగాను శుద్ధులు
అంత్యకాలమందున కన్యగర్భమందున
బుట్టినట్టి రక్షకా ఓ యిమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుఁడా నిన్ను నెన్న శక్యమా?
దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ
3.దావె నీతి సూర్యుఁడా రావె దేవపుత్రుఁడా
నీదు రాకవల్లను లోక సౌఖ్య మాయెను
భూనివాసు లందఱు మృత్యుభీతి గెల్తురు
నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కల్గును
దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ