MAHIMANTHAA VADULUKONI Song Lyrics | మహిమంతా వదులుకొని Song Lyrics - Bro, Stevenson Songs Lyrics
Singer | Bro, Stevenson |
మహిమంతా వదులుకొని - తన రూపం మార్చుకొని
యేసు భువికొచ్చాడని - 2
ఊరంతా సందడి - వాడంతా సందడి - ఊరు వాడ సందడి
మంచిలేని లోకంలో మంచిని స్థాపించడానికి - 2
మేలెట్లా చెయ్యాలో చేసి చూపడానికి - 2
కీడును తొలగించడానికి
పాపమేమిలేనివాడు ఇలలో పుట్టాడని - 2
నింగిలో సందడి - నేలపై సందడి
నింగీ నేలా సందడి - 2
శాంతిలేని లోకంలో శాంతిని దయచేయడానికి - 2
సత్యాన్ని గురించి సాక్ష్యమివ్వడానికి
స్వర్గానికి చేర్చడానికి - 2
శాంతిదాతయైనవాడు ఇలలో పుట్టాడని - 2
ఇంటింటా సందడి - బయటంతా సందడి
ఇంటా బయటా సందడి - 2
కాంతిలేని లోకంలో జ్యోతిని వెలిగించడానికి - 2
దేవుడుగా పరిచయం చేసుకోవడానికి
ప్రత్యక్షత ఇవ్వడానికి - 2
నీతి సూర్యుడైనవాడు ఇలలో పుట్టాడని - 2
కోటలో సందడి పేటలో సందడి
కోటా పేటా సందడి - 2